Header Banner

జనాభా ప్రాతిపదిక తప్పని అఖిలపక్ష సమావేశం తీర్మానం! డీలిమిటేషన్‌పై తమిళనాడు అసహనం!

  Wed Mar 05, 2025 18:46        Politics

జనాభా ఆధారంగా డీలిమిటేషన్‌ వల్ల భారతదేశ సమాఖ్య వ్యవస్థకు, తమిళనాడు, ఇతర దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యానికి తీవ్ర ముప్పు కలుగుతుందని, ఈ చర్యను అఖిల పక్ష సమావేశం ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తోందని ఆ తీర్మానం పేర్కొంది.

నియోజక వర్గాల పునర్విభజనను 1971 జనాభా లెక్కల ప్రకారం 2026 నుంచి వచ్చే 30 ఏళ్లు వర్తించేలా చేపట్టాలని, ఈ మేరకు పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇవ్వాలని కోరుతూ తమిళనాడు అఖిల పక్ష సమావేశం (Tamil Nadu All-party meeting) ఒక తీర్మానాన్ని ఆమోదించింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) అధ్యక్షతన ఈ అఖిల పక్ష సమావేశం బుధవారంనాడు జరిగింది.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!

 

నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఈ అఖిల పక్ష సమావేశానికి 64 పార్టీలను ఆహ్వానించగా, 58 పార్టీలు (ఆర్గనైజేషన్లతో సహా) హాజరయ్యాయి. బీజేపీ, తమిళ మానిల కాంగ్రెస్, పుదియ తమిళగం, పుదియ నీది కట్చి, నామ్ తమిళర్ కట్చి పార్టీలు సమావేశానికి గైర్హాజరయ్యాయి. జనాభా ఆధారంగా డీలిమిటేషన్‌ వల్ల భారతదేశ సమాఖ్య వ్యవస్థకు, తమిళనాడు, ఇతర దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యానికి తీవ్ర ముప్పు కలుగుతుందని, ఈ చర్యను అఖిల పక్ష సమావేశం ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తోందని ఆ తీర్మానం పేర్కొంది.

 

దేశ సంక్షేమం దృష్ట్యా కుటుంబ నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన తమిళనాడుకు ప్రాతినిధ్యం తగ్గడం ఎంతమాత్రం సమంజసం కాదని స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణను ప్రోత్సహించేలా అప్పటి ప్రధాని 2000లో ఒక హామీ ఇచ్చారని, పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విజన విభజన 1971 జనాభా లెక్కల ఆధారంగా ఉంటుందనే హామీ ఇచ్చారని, ఇదే తరహా డ్రాప్ట్‌ను 2026 నుంచి రాబోయే 30 ఏళ్ల వరకూ వర్తించేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా హామీ ఇవ్వాలని ఆ తీర్మానం కోరింది. ''పార్లమెంటులో ఎంపీల ప్రాతినిధ్యం పెంచాలనుకుంటే 1971 జనాభాలెక్కల ఆధారంగా అన్ని దక్షిణాది రాష్ట్రాలకు వర్తించేలా రాజ్యాంగంలో మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వా్నికి అఖిలపక్షం విజ్ఞప్తి చేస్తోంది'' అని ఆ తీర్మానం పేర్కొంది.

 

డీలిమిటేషన్‌కు తమిళనాడు వ్యతిరేకం కాదని, అయితే డీలిమిటేషన్ ప్రక్రియ గత 50 ఏళ్లుగా సాంఘిక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రానికి శిక్ష కాకూడదని తీర్మానం పేర్కొంది. డీలిమిటేషన్ ప్రక్రియపై తమ డిమాండ్లు, నిరసనలు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తమిళనాడు ఎంపీలు, దక్షిణాది రాష్ట్రాల ఎంపీలతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని, ఆయా పార్టీలను లాంఛనంగా ఆహ్వానించాలని అఖిలపక్ష సమావేశం నిర్ణయించినట్టు అ తీర్మానం పేర్కొంది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

 

సీఎం చంద్రబాబుతో సమావేశమైన ఎమ్మెల్సీ గాదె! సమస్యల పరిష్కారానికి కీలక హామీలు!

 

అమెరికాలో తెలుగు యువ‌కుడి అనుమానాస్ప‌ద మృతి! స్థానికంగా ఉండే ఓ స్టోర్‌లో..

 

నేడు విజయవాడ పోలీసుల విచారణకు వైసీపీ నేత! భారీగా జన సందోహంతో..

 

వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స.. ఆత్మహత్యకు గల కారణంపై.. ఆసుపత్రికి పలువురు ప్రముఖులు

 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు కీలక పదవి.. త్వరలోనే నియామకం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Delimitation #TamilNadu #SouthIndia #PoliticalRepresentation #EqualRights #Census1971 #Democracy #FairRepresentation #IndianPolitics #Parliament